ఏపీలోని MBA, MCA కళాశాలల్లో 2019-20 సంవత్సరానికి ప్రవేశాల కోసం తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ ‘ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఐసెట్)-2019’ నోటిఫికేఫన్‌ను ఫిబ్రవరి 20న విడుదల చేసింది. దీనిద్వారా MBA/MCA మొదటి సంవత్సరం, లేటరల్ ఎంట్రీ ద్వారా MCA రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఫిబ్రవరి 27 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. ఈ ఏడాది ఏప్రిల్ 26న ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 27 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు సమయంలో విద్యార్థి ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరిగా నమోదుచేయాల్సి ఉంటుంది. ఐసెట్-2019 పరీక్షను మే 26న రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
* దరఖాస్తు విధానం:
– ఆన్‌లైన్ దరఖాస్తు.
* దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి. అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
* విద్యా అర్హత :
డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 27.02.2019 |
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది | 27.03.2019 |
ఐసెట్ పరీక్ష తేది | 26.04.2019 |