New Course in Inter: విద్యార్థులకు అలర్ట్‌.. ఇంటర్‌లో కొత్త కోర్సు.. పూర్తి వివరాలివే..

ఇక 6వ స‌బ్జెక్టును ఆప్ష‌న‌ల్‌గా పెట్టనుంది ఇంటర్ బోర్డు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులకు అలర్ట్‌. ఇంటర్‌లో కొత్త కోర్సు ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలపై ఆంధ్రప్రదేశ్ సర్కారు ఓ ప్రకటన చేసింది.

రానున్న విద్యాసంత్సరం (2015-2016) నుంచి ఇంట‌ర్మీటియట్ విద్యార్థుల‌ కోసం ఎంబైపీసీ కోర్సును తీసుకురానున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న ఎంబైపీసీ అంటే ఆ రెండు కోర్సుల‌ను క‌లిపి తీసుకురావడం. ఈ మేరకు ఇప్పటికే విద్యామండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పటివరకు ఎంపీసీ చదివిన వారు కేవలం ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి మాత్రమే అవకాశం ఉంది.

Also Read: మహాద్భుతంగా ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 డిజైన్‌.. వారెవ్వా.. ఈ ఫొటోలు చూశారా?

అలాగే బైపీసీ చదివిన వారు వైద్య విద్య కోర్సుల్లో చదవడానికి అవకాశం ఉంటుంది. ఎంబైపీసీ కోర్సును పూర్తి చేసుకున్న‌ విద్యార్థి మాత్రం ఇంజినీరింగ్ లేదా మెడిసిన్ కోర్సులో ఏదైనా ఒకదాంట్లో చేరవచ్చు.

దీంతో విద్యార్థి ఇంజనీర్‌ కావాలనుకుంటే అందుకు సంబంధించిన ఉన్నత విద్యను, డాక్టర్‌ కావాలనుకుంటే అందుకు సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఎంబైపీసీలో మ్యాథ్స్‌ ఒకే స‌బ్జెక్టుగా ఉంటుంది.

ఇక బోట‌నీ-జువాల‌జీ క‌లిసి బ‌యోల‌జీగా ఉంటుంది. ఈ మేరకు మార్పులు చేయ‌నున్నట్లు ఇంట‌ర్ విద్యామండ‌లి తెలిపింది. ప్రథమ స‌బ్జెక్టుగా ఆంగ్లంతో క‌లిపి 5 స‌బ్జెక్టులు ఉంటాయి. ఇక 6వ స‌బ్జెక్టును ఆప్ష‌న‌ల్‌గా పెట్టనున్నారు. ఇక ఆర్ట్ గ్రూపులకు సంబంధించిన 5 స‌బ్జెక్టులు ఉంటాయి.