iPhone 17: మహాద్భుతంగా ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 డిజైన్‌.. వారెవ్వా.. ఈ ఫొటోలు చూశారా?

ఐ ఫోన్ 17 గురించి మరిన్ని వివరాలు లీక్ అయ్యాయి.

iPhone 17: మహాద్భుతంగా ఐఫోన్‌ 17 ప్రో, ఐఫోన్‌ 17 డిజైన్‌.. వారెవ్వా.. ఈ ఫొటోలు చూశారా?

Updated On : February 15, 2025 / 2:42 PM IST

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు యూజర్లకు అందాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే. అయినప్పటికీ, ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో కనపడుతున్నాయి. ఈ సిరీస్‌లోని రెండు మోడళ్లు ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో గురించి మరో విషయం బయటకు వచ్చింది.

డిజైన్ ఎలా ఉండొచ్చు?
లీకైన ఇమేజ్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 లో వెనుక భాగంలో కాస్త పెద్ద సైజులో కెమెరా సెక్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. రెగ్యులర్ ఐఫోన్ 17లో రెండు కెమెరాలు పక్కపక్కనే హారిజాంటల్‌గా సమాంతర లేఅవుట్‌లో ఉంటాయి.

ఇక ఐఫోన్ 17 ప్రో కెమెరా డిజైన్‌.. ఐఫోన్ 16 ప్రోలా ఉంటుంది. ఇప్పుడు కొత్త ఐఫోన్ వెనుక భాగంలో వేరే కెమెరా డిజైన్ ఉండవచ్చు. గత సంవత్సరం ఆపిల్ తమ ఐఫోన్ 16, 16 ప్లస్ కెమెరాలను నిలువుగా ఉంటేటట్లు మార్చింది.

ఐఫోన్ల విశ్లేషకుడు మజిన్‌బు ట్విట్టర్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో డిజైన్ల వివరాలను అంచనా వేసి చెప్పాడు. కొత్త ఐఫోన్‌లోని అల్ట్రావైడ్ కెమెరాలు ఫోన్ వెనుక భాగంలో కెమెరా బార్‌లో పక్కపక్కనే ఉంటాయి.

దానికి కుడి వైపున ఒక చిన్న ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. కెమెరా బార్ డార్క్‌గా ఉంటుంది. ఫొటోలో చూపించిన ఐఫోన్ వైట్ కలర్‌లో ఉన్నప్పటికీ, ఫోన్ ఏ రంగులో ఉన్నా బార్ అదే ముదురు రంగుతో ఉంటుంది.


మరోవైపు, జోన్ ప్రాసెసర్ ఫ్రంట్‌పేజీటెక్ యూట్యూబ్ ఛానెల్‌లోని చూపించిన వీడియో ప్రకారం మాత్రం ఐఫోన్ 17 ప్రోలో పొడవైన కెమెరా బార్ ఉంటుంది. మూడు బ్యాక్ కెమెరాలు కూడా ఒకే డిజైన్‌లో ఉన్నాయి. ఇది చాలా తెలిసిన రూపకల్పనలో ఉంది.

ఇటీవల బయటకు వచ్చిన లీక్‌ల ప్రకారం.. ఐఫోన్ 17 ప్రో మూడు కెమెరాలు ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. అయితే, ఫ్రంట్‌పేగెటెక్ నుంచి వచ్చిన కొత్త ఫొటోలు ఐఫోన్ 16 ప్రో మాదిరిగానే ఈ కొత్త ఫోన్‌లో కెమెరా సెటప్‌ను చూపుతున్నాయి. అలాగే, ఎల్‌ఈడీ ఫ్లాష్ కెమెరా బార్ వాటి కుడి వైపున ఉంటుంది.