Site icon 10TV Telugu

AP Inter Exams: ఈ ఇయర్ ఫిబ్రవరిలోనే ఇంటర్‌ పరీక్షలు.. పరీక్షా విధానంలోనూ మార్పులు.. ఇంటర్మీడియట్‌ విద్యామండలి కీలక నిర్ణయం

AP Inter exams to be held in February this year

AP Inter exams to be held in February this year

AP Inter Exams: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్‌ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. గత సంవత్సరం వరకు ఈ పరీక్షలు మార్చిలో జరుగగా.. ఈసారి మాత్రం (AP Inter Exams)సీబీఎస్‌ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, పరీక్షల విధానంలోనూ మార్పులు చేశారు.

Railway Jobs: రైల్వేలో జాబ్స్.. 865 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు, పూర్తి వివరాలు

సైన్స్‌ విద్యార్థులకు ముందుగా గ్రూపు సబ్జెక్టులతో పరీక్షలు పారంభమవుతాయి. రోజుకు ఒక్క సబ్జెక్టు సంబందించిన పరీక్ష మాత్రమే ఉండనుంది. గతంలో ఎంపీసీ విద్యార్థులకు సబ్జెక్టు పరీక్ష ఉన్నరోజు బైపీసీ, ఆర్ట్స్‌ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు ఒకరోజు ఒక సబ్జెక్టు సంబందించిన పరీక్షా మాత్రమే ఉండనుంది. సైన్స్‌ గ్రూపు సబ్జెక్టుల పరీక్షలు అన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉండనున్నాయి. ఈ పరీక్షల అనంతరం ఆర్ట్స్‌ గ్రూపుకు సంబందించిన పరీక్షలు మొదలవుతాయి. ప్రాక్టికల్‌ పరీక్షలపై మాత్రం ఇంకా సందిగ్ధం వీడలేదు. జనవరి చివరిలో నిర్వహించాలా? లేదంటే రాతపరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా? ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో మాత్రం చాలా మార్పులు జరిగాయి. పూర్తిగాఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలులోకి తీసుకువచ్చారు. అలాగే ప్రశ్నపత్రాల విధానాన్ని కూడా మార్చారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులకు 85 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహిస్తారు. మిగిలిన మార్కులు రెండో ఏడాదిలో ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. ఇక అన్ని పేపర్లలోనూ ఒక్క మార్కు ప్రశ్నలను ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చారు.

Exit mobile version