చెక్ ఇట్: ఏపి హెల్త్ ప్రొవైడర్ ఫలితాలు వచ్చేశాయి

ఏపీలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో మిడ్ లెవల్ ప్రొవైడర్ల పోస్టులకు డిసెంబర్ 10,2019 పరీక్ష నిర్వహించింది. వైద్యారోగ్య శాఖ ఫలితాలను విడుదల చేసింది. రాత పరీక్షలో పాసైన అభ్యర్ధుల జాబితాను జోన్ల వారీగా, హాల్ టికెట్ నెంబర్, పేరుతో సహా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అన్ని జోన్ల కలిపి మెుత్తం 11వేల 441 మంది అభ్యర్దులు అర్హత సాధించారు.
శిక్షణ ఇలా :
రాత పరీక్షల్లో అర్హత సాధించినవారికి 6 నెలల శిక్షణ.జనవరి 1,2020 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియామకం.
సాలరీ : ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.25వేలు చెల్లిస్తుంది. శిక్షణ సమయంలో ఎలాంటి స్టైఫండ్ చెల్లించదు.
ముఖ్య తేదిలు :
ప్రవేశ పరీక్ష తేదీ : డిసెంబర్ 10,2019.
బ్రిడ్జ్ కోర్సు కౌన్సిలింగ్: డిసెంబర్ 23,2019.
బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం: జనవరి 01,2020.