టీవీలో నేరుగా చూసుకోండి: ఏపీ 10వ తరగతి ఫలితాలు

ఏపీలో 10వ తరగతి ఫలితాలు మంగళవారం (మే 14, 2019) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. అన్ని ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో ఫలితాలు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలో హాజరైన విద్యార్ధులు, వారి ఫలితాలను అధికారిక వెబ్సైట్ bseap.org ద్వారా చెక్ చేసుకోవచ్చు.
అసలు విషయం ఏంటో తెలుసా ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు టీవీల్లో విద్యార్థి హాల్ టికెట్ నెంబరు టైపు చేయగానే ఫలితాలు కనిపించేలా ఏర్పాట్లు చేసినట్టు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) అధికారులు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్, ఖైజాలా యాప్, ఫైబర్ నెట్ టీవీల్లోనూ ఫలితాలను పరిశీలించుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. www.rtgs.ap.gov.in లింక్స్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.