ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈనెల 22న ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 9న జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. ఇప్పుడు మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు దాదాపు 6.50 లక్షల మంది విద్యార్థులు రాశారు.
గత ఏడాది ఇదే తేదీకి..
ఏపీ పదో తరగతి ఫలితాలు గత ఏడాది కూడా ఏప్రిల్ 22నే విడుదలయ్యాయి. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ కమిషనర్ ఫలితాలను విడుదల చేశారు. 2024లో ఈ పరీక్షకు 6.54 లక్షల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా, వారిలో 6.23 లక్షల మంది పరీక్షలు రాశారు.
10వ తరగతి ఫలితాలు వచ్చాక ఇలా చెక్ చేసుకోవచ్చు