కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రోలో ఏది బెస్ట్? ఫుల్ డీటెయిల్స్..
వీటినిబట్టి నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో స్మార్ట్‌ఫోన్లలో ఏది కొనాలో మీరే డిసైడ్ కావచ్చు.

నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా మార్చి 4న లాంచ్ చేశారు. భారత్‌లో మార్చి 11 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. నథింగ్ ఫోన్లను ఇష్టపడేవారు ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఏదో ఒకటి కొనాలని భావిస్తారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఏది మీకు మంచి ఆప్షనో వివరించి చెబుతున్నారు విశ్లేషకులు.
నథింగ్ నుంచి వచ్చిన ఈ రెండు కొత్త ఫోన్‌ల ధర రూ.33 వేలలోపే ఉంది. అయితే, నథింగ్ ఫోన్ 3ఏ కంటే ఫోన్ 3ఏ ప్రో వెర్షన్ ధర రూ.5,000 ఎక్కువగా ఉంది. ఫోన్ 3ఏ ప్రో ధర రూ.5,000 అధికంగా ఉన్నప్పటికీ ఆ వర్షన్ కంటే ఫోన్ 3ఏ కంటే ఏ మాత్రం తీసిపోదు.
Also Read: లాంచింగ్‌కు మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫీచర్లు రెడీ.. కళ్లు చెదిరే ఫీచర్లు
నథింగ్ ఫోన్ 3a ఫీచర్లు
బ్యాక్ కెమెరాలు: 50MP (వెడల్పు) + 50MP (టెలిఫొటో) + 8MP (అల్ట్రావైడ్)
ఫ్రెంట్ కెమెరా 32MP
RAM 8GB
స్టోరేజ్ 128GB / 256GB
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో ఫీచర్లు
బ్యాక్ కెమెరాలు: 50MP (వెడల్పు) + 50MP (పెరిస్కోప్ టెలిఫొటో) + 8MP (అల్ట్రావైడ్)
ఫ్రెంట్ కెమెరా 50MP
RAM 8GB / 12GB
స్టోరేజ్ 128GB / 256GB
ధరలు
నథింగ్ ఫోన్ 3a
8GB RAM + 128GB స్టోరేజ్: రూ.24,999
8GB RAM + 256GB స్టోరేజ్: రూ.26,999
12GB RAM + 256GB స్టోరేజ్: రూ.28,999
నథింగ్ ఫోన్ 3a ప్రో
8GB RAM + 128GB స్టోరేజ్: రూ.29,999
8GB RAM + 256GB స్టోరేజ్: రూ.31,999
12GB RAM + 256GB స్టోరేజ్: రూ.33,999
వీటినిబట్టి నథింగ్ ఫోన్ 3ఏ ప్రో కంటే నథింగ్ ఫోన్ 3ఏ కొనడం చాలా ఉత్తమమని విశ్లేషకులు అంటున్నారు. ధర తక్కువ, ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా స్టాండర్డ్ వర్షన్‌ల కంటే ప్రో వర్షన్‌లు బాగా ఆకర్షిస్తుంటాయి. ఈ సారి మాత్రం ప్రో వర్షన్ కంటే స్టాండర్డ్ వర్షన్ బాగుందని విశ్లేషకులు అంటున్నారు.