లాంచింగ్‌కు మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫీచర్లు రెడీ.. కళ్లు చెదిరే ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది.

మోటోరోలా నుంచి ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఈ నెల 2న లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 9న భారత్‌లో వీటి అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మోటోరోలా నుంచి ఎడ్జ్ 60 స్టైలస్ లాంచ్ కానుంది.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 17న లాంచ్ చేస్తారని లీకుల ద్వారా తెలుస్తోంది. దీని లాంచింగ్ గురించి అధికారికంగా మాత్రం ఆ కంపెనీ ఇప్పటివరకు ప్రకటన చేయలేదు.
Also Read: 5 పాయింట్లలో iQOO Z10 రివ్యూ.. ఈ స్మార్ట్‌ఫోన్ మీకు నచ్చుతుందా? నచ్చదా?
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఫీచర్లు
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎడ్జ్ 60 స్టైలస్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్‌కు చాలా అనువుగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15తో రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల pOLED డిస్‌ప్లేతో ఇది రీలీజ్ కానుంది.
కెమెరాల విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, వైడ్-యాంగిల్ షాట్‌ల కోసం 13-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో ఇది విడుదల కానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ 32-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుంది. 68W వైర్డ్ సపోర్ట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో రీలీజ్ కానుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ధర సుమారు రూ. 43,600 ఉండవచ్చని తెలుస్తోంది. కొన్ని రోజుల్లో ఇది విడుదల కానుండటంతో దీనిపై త్వరలోనే పూర్తి స్పష్టత రావచ్చు.
480Hz టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో మోటోరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. UIతో Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది రానుంది. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఆడియోతో ఇది రావచ్చు. వీడియో రికార్డింగ్ 30fps వద్ద 4K, 30fps వద్ద 1080pగా ఉండొచ్చు.