5 పాయింట్లలో iQOO Z10 రివ్యూ.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీకు నచ్చుతుందా? నచ్చదా?

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మంచి ఫీచర్లతో పాటు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.

5 పాయింట్లలో iQOO Z10 రివ్యూ.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీకు నచ్చుతుందా? నచ్చదా?

iQOO Z10 review

Updated On : April 14, 2025 / 9:57 PM IST

iQOO Z10 హై ఎండ్ మొబైల్ గత వారం భారత్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఏకంగా 7300mAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ రిలీజ్ అయింది. ఈ నెలలో ఇలాంటి పెద్ద బ్యాటరీలతో మరికొన్ని ఫోన్‌లు కూడా రిలీజ్ అవకాశం ఉంది. 7.8mm (చాలా సన్నని) బాడీతో వచ్చిన iQOO Z10 ఫోన్‌లో ఇంత పెద్ద బ్యాటరీని తీసుకురావడంలో సక్సెస్ అయిన టెక్నిషియన్లను గ్రేట్ అని అనాల్సిందే.

పెద్ద బ్యాటరీతో పాటు ఈ ఫోన్‌లో మీకు స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్, ఆండ్రాయిడ్ 15 ఫన్‌టచ్ OS, AMOLED డిస్‌ప్లే, అలాగే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం ఉన్నాయి. iQOO Z10 మొబైల్ చాలా మంచి ఫీచర్లతో వచ్చింది. విశ్లేషకులు ఈ ఫోన్‌ను వారం రోజుల పాటు టెస్ట్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మంచి ఫీచర్లతో పాటు కొన్ని లోపాలు కూడా ఉన్నాయని చెప్పారు. వాళ్ల రివ్యూ ఎలా ఉందంటే..?

7300mAh బ్యాటరీ
iQOO Z10 ఫోన్‌ను వీడియోలు చూడటం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, చిన్నపాటి గేమింగ్, కాల్స్ వంటి వాటి డైలీ యాక్టివిటీస్‌కి యూజర్‌ ఫ్రెండ్లీగా వాడుకోవచ్చు. స్క్రీన్ ఆన్ టైం 7-8 గంటలు ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్‌టైమ్‌ అధికంగా ఉంది. అధికంగా వినియోగించినా 24-28 గంటల వరకు పనిచేస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ 0 నుంచి 100% ఛార్జ్ కావడానికి దాదాపు 2 గంటలు పడుతుంది.

Also Read: కిరాక్ లుక్‌, డిజైన్‌తో వన్‌ప్లస్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. మీరు సిద్ధమేనా..?

భారీ బ్యాటరీ ఉన్నా కూడా స్లిమ్ డిజైన్
iQOO Z10 ఫోన్ 7.8mm మందం, 199 గ్రాముల బరువు ఉండడంఈతో యూజర్ల చేతిలో సౌకర్యంగా పట్టుకోవచ్చు. ప్లాస్టిక్‌తో తయారు చేసినప్పటికీ స్టెల్లార్ బ్లాక్ వేరియంట్ చూడటానికి బాగానే ఉంటుంది. వెనుకవైపు పెద్ద గుండ్రటి కెమెరా డిజైన్‌లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. కానీ, రెండో కెమెరా అంత యూస్ ఉండకపోవచ్చు. ముందు భాగంలో కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లే, పంచ్ హోల్ కెమెరా మంచి వ్యూ అనుభవాన్ని అందిస్తాయి.

AMOLED డిస్‌ప్లే
ఈ ఫోన్ 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఈ ఫీచర్స్ వల్ల ఈ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ను ఇళ్లు, ఆఫీసుల్లోనే కాకుండా బయటి ప్రదేశాల్లోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు.

స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ కారణంగా ఈ ఫోన్ రోజువారీ పనులను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. యాప్స్ వేగంగా ఓపెన్ అవుతాయి. మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉంటుంది. అయితే, ఆండ్రాయిడ్ 15 ఫన్‌టచ్ OS 15లో ఎక్కువ సంఖ్యలో అనవసరమైన అప్లికేషన్‌లు ఉండటం కొంచెం నిరాశ కలిగించవచ్చు.

అయినప్పటికీ వాటిని తొలగించే అవకాశం ఉంది. ఆడియో విషయానికి వస్తే కేవలం ఒకే స్పీకర్ ఉండటం, అలాగే అధిక శబ్దంలో నాణ్యత అంతగా లేకపోవడం వల్ల వీడియో, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌లో యూజర్లు కాస్త నిరాశ చెందవచ్చు.

రూ.19,999 ప్రారంభ ధరతో వచ్చిన ఈ ఫోన్ ఎక్కువ సేపు బ్యాటరీ ఇచ్చే ఫోన్ లు కావాలనుకునే విద్యార్థులు, సాధారణ యూజర్లకు బాగా నచ్చుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆడియో వంటి ఫీచర్లు అద్భుతంగా ఉండాలని భావిస్తే మాత్రం వారికి ఈ స్మార్ట్‌ఫోన్‌ నచ్చకపోవచ్చు.