OnePlus: కిరాక్ లుక్‌, డిజైన్‌తో వన్‌ప్లస్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. మీరు సిద్ధమేనా..?

OnePlus 13T ఈ నెల చివరిలో లాంచ్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

OnePlus: కిరాక్ లుక్‌, డిజైన్‌తో వన్‌ప్లస్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. మీరు సిద్ధమేనా..?

Updated On : April 14, 2025 / 7:38 PM IST

వన్‌ప్లస్‌ 13T స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే విడుదల కానుంది. ఆ ఫోన్‌కు సంబంధించి లీకైన టీజర్‌లో దాని డిజైన్ చేంజ్‌, ఫీచర్ల వంటి వివరాలు తెలిశాయి. ఆ కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా మాత్రం దాని లుక్‌ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

తాజాగా లీకైన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ 13టీ డిజైన్ బ్యాక్‌ ప్యానెల్‌లో డ్యూయల్-కెమెరా సెటప్‌ ఉంటుంది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే వన్‌ప్లస్ 13టీ డిజైన్ చాలా ప్రత్యేకతలతో వస్తోంది. బ్యాక్‌ ప్యానెల్‌లోని కెమెరా మాడ్యూల్ కొద్దిగా పెద్ద సైజులో ఉండనుంది.

వన్‌ప్లస్ చైనా అధ్యక్షుడు లూయిస్ లీ ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్ వేరియంట్‌లలో వస్తోంది. వన్‌ప్లస్ 13తో కంటే చిన్న స్క్రీన్‌తో వస్తోంది. వన్‌ప్లస్ 13టీలో 6.82 అంగుళాల ప్యానెల్ ఉంది. 6.3-అంగుళాల OLED డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ చుట్టూ స్లిమ్ బెజెల్స్ ఉంటాయి.

Also Read: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌

ఇందులో అలెర్ట్‌ స్లైడర్‌ కాకుండా ఎడమ వైపున కొత్త షార్ట్‌కట్‌ కీ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎలైట్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వస్తుంది. 16GB RAM, 512GB స్టోరేజ్‌ వేరియంట్లో విడుదల కావచ్చు.

బ్యాక్‌సైడ్‌లో రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ సామర్థ్యం సుమారు 6,200 ఎంఏహెచ్ ఉండొచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు ఉండే అవాశం ఉంది. చైనాలో లాంచ్‌ అయిన కొన్ని గంటలకే ఇది భారత్‌లోనూ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

OnePlus 13Tను ఈ నెల చివరిలో లాంచ్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీని బరువు 185 గ్రాములు ఉండొచ్చు. ఇది మెటల్ ఫ్రేమ్, కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌తో వచ్చే ఛాన్స్ ఉంది. OnePlus 13 “మినీ” వెర్షన్‌గా OnePlus 13Tను తీసుకొస్తున్నట్ఉల తెలుస్తోంది.