Oppo: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌

బ్యాక్‌ ప్యానెల్‌లో డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ ఉంటుంది.

Oppo: తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌

Updated On : April 14, 2025 / 5:08 PM IST

ఒప్పో నుంచి గత నెల 20న OPPO F29 సిరీస్‌లో భాగంగా OPPO F29 5G, OPPO F29 PRO 5G స్మార్ట్‌ఫోన్లు భారత్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కంపెనీ నుంచి ఒప్పో మిడ్-సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో K13 5G వచ్చేస్తోంది. దీని లాంచ్‌ డేట్‌ను ఆ కంపెనీ కన్ఫార్మ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీ సామర్థ్యంతో, 50-మెగాపిక్సెల్ ఏఐ కెమెరా సహా అనేక హై-ఎండ్ ఫీచర్లతో విడుదల కానుంది. K13 5G స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 చిప్‌తో వస్తోంది.

Oppo K13 5G రూ.20,000 కంటే తక్కువ ధరతో విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్ 21న లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 17,000గా ఉంటుందని భావిస్తున్నారు. అదనంగా, కంపెనీ బ్యాంక్ డిస్కౌంట్లను కూడా అందించవచ్చు. తొలుత ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంటాయి.

ఫీచర్లు ఇవే..
Oppo K13 5G 120Hz రిఫ్రెష్ రేట్, 1200nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లేతో రానుంది. Oppo K13 5G బ్యాక్‌ ప్యానెల్‌ జియోమెట్రికల్ ఇమేజ్‌లతో వస్తుంది. కంపెనీ అధికారికంగా ఫోన్ రెండు కలర్‌ వేరియంట్‌లను చూపింది. నలుపు, తెలుపు రంగు వేరియంట్లతో ఇది వస్తుంది.

టెక్స్చర్ ఇంకా తెలియకపోయినా ఫోన్ కాంపాక్ట్, స్లిమ్ ప్రొఫైల్‌ను ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాక్‌ ప్యానెల్‌లో డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ ఉంటుంది. కెమెరా ప్యానెల్ OnePlus 13T మాడ్యూల్‌ను పోలి ఉంటుంది.

OPPO K13 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఇందులో Adreno A810 GPU, LPDDR4X RAM UFS 3.1 స్టోరేజ్‌తో ఉంటుంది. Oppo K13 5G 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుంది.

Oppo K13 5G 7,000mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 30 నిమిషాల్లో 62 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. స్మార్ట్ ఛార్జింగ్ ఇంజిన్ 5.0తో ఇది రానుంది.