NIT Warangal PhD Admission 2023 : వరంగల్‌ నిట్‌ లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు దరఖాస్తు !

పీహెచ్‌డీ (PhD) ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి డిసెంబర్‌-2023 సెషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా ఇంజినీరింగ్ లోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు.

NIT Warangal PhD Admission 2023

NIT Warangal PhD Admission 2023 : వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహెచ్‌డీ (PhD) ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి డిసెంబర్‌-2023 సెషన్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా ఇంజినీరింగ్ లోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు గేట్‌/ క్యాట్‌/ యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ఇన్‌స్పైర్‌/నెట్‌ స్కోరు సాధించిన అభ్యర్ధులు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.

READ ALSO : Revanth Reddy : తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ .. అమిత్ షా,కేసీఆర్ కామన్ ప్లాన్ అర్థం చేసుకోవాలని సూచన

పీహెచ్‌డీ ప్రవేశాలు – డిసెంబర్‌ 2023 సెషన్‌

కోర్సుల విభాగాలు..

సివిల్ ఇంజినీరింగ్

ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్

మెకానికల్ ఇంజినీరింగ్

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్

మ్యాథ్స్‌

ఫిజిక్స్‌

కెమిస్ట్రీ

హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్

స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్

మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్

కెమికల్ ఇంజినీరింగ్

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్

బయోటెక్నాలజీ

READ ALSO : Vignan University V-SAT 2024 : విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ప్రవేశాలకు వీశాట్-2024 దరఖాస్తుల ఆహ్వానం !

అర్హత:

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు గేట్‌/క్యాట్‌/యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌/ఇన్‌స్పైర్‌/నెట్‌ స్కోరు సాధించి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

దరఖాస్తు ఫీజుగా రూ.1600. చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.800 చెల్లించాలి.

READ ALSO : CM Jagan : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

దరఖాస్తు విధానం:

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

READ ALSO : Pregnancy After 40 : 40 ఏళ్ల తర్వాత గర్భందాల్చటం సురక్షితమా ? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరితేది: 04.12.2023.

రాత పరీక్ష/ ఇంటర్వ్యూ: 18 డిసెంబర్ నుండి 20.12.2023

ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా వెల్లడి: 26.12.2023.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.nitw.ac.in/

ట్రెండింగ్ వార్తలు