Pregnancy After 40 : 40 ఏళ్ల తర్వాత గర్భందాల్చటం సురక్షితమా ? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

40 ఏళ్ళ వయస్సులో గర్భందాల్చేవారిలో ముందస్తుగా శిశువులు జన్మించే ప్రమాదం పెరుగుతుంది. నవజాత శిశువు ఆరోగ్య సమస్యలకు దారి తీసేందుకు కారణమవుతుంది.

Pregnancy After 40 : 40 ఏళ్ల తర్వాత గర్భందాల్చటం సురక్షితమా ? నిపుణులు ఏంచెబుతున్నారంటే ?

Pregnancy After 40

Pregnancy After 40 : గత కొన్ని సంవత్సరాలుగా లేటు వయస్సులో వివాహాలు చేసుకునే పరిస్ధితి స్త్రీ, పురుషులలో నెలకొంది. చాలా మంది మహిళలు 40 సంవత్సరాల వయస్సులో గర్భం ధరించి బిడ్డలకు తల్లులుగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో 40 ఏళ్ల వయసులో బిడ్డ పుట్టడం సర్వసాధారణంగా మారింది. చాలా మంది మహిళలు తమ 40 ఏళ్ల వయసులో పిల్లలను కనేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఆలస్యంగా గర్భం దాల్చడం ఎంతవరకు సురక్షితమైనది. దాని వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి అన్నదానిపై చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది.

READ ALSO : Diabetes and Fertility : మధుమేహాంతో స్త్రీ,పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు.. నివారణా మార్గాలు !

గర్భం ధరించటం ఏవయస్సులో సురక్షితం ;

వాస్తవానికి గర్భం ధరించడానికి సరైన వయస్సు 20 సంవత్సరాల నుండి 30 ఏళ్ల మధ్య మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వయస్సులో గర్భం దాల్చటం వల్ల తల్లి , బిడ్డ ఇద్దరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. 40 సంవత్సరాల వయస్సులో గర్భం దాల్చడం అన్నది క్లిష్టంగానే ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. మొదటి బిడ్డకు జన్మనివ్వడానికి సరైన వయస్సు 30 సంవత్సరాలు అని ఒక అధ్యయనం సూచించింది.

అయితే రెండవ గర్భధారణ విషయానికి వస్తే ఇది తల్లి ఆరోగ్యంపైనే అధారపడి ఉంటుంది. మొదటి గర్భం నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే రెండవసారి గర్భంధరించే విషయం గురించి ఆలోచించాలి. ఒక అధ్యయనం ప్రకారం, మొదటి డెలివరీ అయిన ఆరు నెలల్లోపు గర్భం దాల్చిన శిశువులలో నెలలు నిండకుండానే పుట్టటం, తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. రెండు గర్భాల మధ్య 18-23 నెలల విరామం తీసుకోవటం మంచిది. మొదటి గర్భం నుండి పూర్తిగా కోలుకోవడానికి , తిరిగి గర్భంధరించటానికి తల్లికి తగినంత సమయం ఇవ్వటం మంచిది.

READ ALSO : Rare Cow Calf : అద్దె గర్భం ద్వారా అరుదైన సాహివ్రాల్ ఆవు దూడ జననం.. ఏపీలో ఇదే మొదటి ప్రయోగం

వయస్సుతోపాటు సంతోనోత్పత్తి క్షీణించటం ;

వయస్సుతో పాటు స్త్రీ సంతానోత్పత్తి క్షీణించడంతో గర్భం ధరించడం అన్నది సవాలుగా మారుతుంది. 35 సంవత్సరాల వయస్సు తర్వాత, స్త్రీ యొక్క అండాల పరిమాణం , నాణ్యత తగ్గుతుంది, ఇది గర్భం ధరించటాన్ని కష్టంగా మారుస్తుంది. 40 ఏళ్లు పైబడిన మహిళల్లో ప్రతి నెల అండాలు విడులయ్యే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే చాలా మంది మహిళలు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) లేదా ఇతర సంతానోత్పత్తి చికిత్సలు వంటి వైద్యపరమైన చికిత్సలు పొందటం మంచిది. ఈ సాంకేతికత గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది. 40 ఏళ్లు పైబడిన మహిళలు తరుచుగా ప్రినేటల్ చెక్-అప్‌లకు వైద్యులు సిఫార్సు చేస్తారు. ఈ పర్యవేక్షణ కారణంగా సమస్యలను సకాలంలో గుర్తించడానికి వీలుకలుగుతుంది.

40 ఏళ్లు పైబడిన స్త్రీలలో మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. తల్లి, బిడ్డ ఇద్దరి శ్రేయస్సుకోసం గర్భధారణ సమయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది.

READ ALSO : After Abortion : గర్భంస్రావం తరువాత తిరిగి అలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే?

40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల కలిగే ప్రమాదాలు :

గర్భస్రావం ప్రమాదం: గర్భస్రావం ప్రమాదం అన్నది తల్లి వయస్సుతో పెరుగుతుంది. తల్లికడుపులో అభివృద్ధి చెందుతున్న పిండంలో క్రోమోజోమ్ అసాధారణతలకు కారణమవుతుంది. ఈ సమస్యలను గుర్తించటానికి ప్రారంభం లో జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం.

గర్భధారణ మధుమేహం: 40 ఏళ్లు పైబడిన మహిళలు గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి తల్లి , బిడ్డ ఇద్దరికీ క్షేమంకాదు. శిశువు తక్కువ బరువుతో జన్మించటం, సిజేరియన్ ప్రమాదాన్ని కలిగిస్తుంది.

READ ALSO : Babies In The Womb: గర్భంలో శిశువులకు ఏమిష్టమో తెలుసా.. తొలిసారిగా బయటపడ్డం నిజం.. ఫొటోలే సాక్ష్యం

హైపర్‌టెన్షన్ : గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు అన్నది 40సంవత్సరాల వయస్సులో గర్భందాల్చిన వారిలో ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ రక్తపోటు పర్యవేక్షణ ఈ సందర్భంలో చాల అవసరం.

ముందస్తు జననం : 40 ఏళ్ళ వయస్సులో గర్భందాల్చేవారిలో ముందస్తుగా శిశువులు జన్మించే ప్రమాదం పెరుగుతుంది. నవజాత శిశువు ఆరోగ్య సమస్యలకు దారి తీసేందుకు కారణమవుతుంది. ముందస్తు ప్రసవాన్ని నివారించడానికి తగిన జాగ్రత్తలు, వైద్యపర్యవేక్షణ అవసరమవుతుంది.

ఎక్కువ సార్లు గర్భధారణలు: సంతానోత్పత్తి చికిత్సలు చేయించుకుంటున్న మహిళలు, 40 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారిలో నెలలు నిండకుండానే శిశువులు పుట్టే ప్రమాదాలు పెరుగుతాయి.

READ ALSO : Eclipses : గ్రహణాలు .. నమ్మకాలు .. గర్భంలో శిశువులకు ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?

ప్రస్తుతం వైద్య శాస్త్రంలో వచ్చిన అనేక మార్పులు, ప్రినేటల్ కేర్, జీవనశైలి వల్ల 40 తరువాత కూడా బిడ్డలను కలనటం పెద్ద కష్టమేమికాదు. 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల ఎదురయ్యే పరిస్ధితులను ముందుగా అవగాహన కలిగి ఉండటం ద్వారా ప్రమాదాలను తగ్గించుకునేందుకు, జాగ్రత్తలు పాటించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.