Apprentice Vacancies : హైదరాబాద్ ఈసీఐఎల్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. శిక్షణ సమయంలో స్టైఫెండ్‌గా నెలకు రూ.7,700 నుంచి రూ. 8,050 అందజేస్తారు.

Hyderabad ECIL

Apprentice Vacancies : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌)లో అప్పెంటిస్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కింద 484 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Management of Cultivation : రబీకి అనువైన అపరాల రకాలు.. అధిక దిగుబడుల కోసం సాగు మేలైన యాజమాన్యం

ట్రేడ్‌ల వారిగా అప్రెంటిస్‌ ఖాళీల వివరాలకు సంబంధించి ఈఎం – 190 , ఎలక్ట్రీషియన్‌ – 80, ఫిట్టర్‌ – 80 , ఆర్‌ అండ్‌ ఏసీ – 20, టర్నర్‌ – 20 6. మెషినిస్ట్‌ – 15, మెషిని్‌స్ట(జి) – 10, సీవోపీఏ – 40, వెల్డర్‌ – 25,పెయింటర్‌ – 4 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి శిక్షణ కాలం ఒక సంవత్సరం పాటు ఉంటుంది. శిక్షణ సమయంలో స్టైఫెండ్‌గా నెలకు రూ.7,700 నుంచి రూ. 8,050 అందజేస్తారు.

READ ALSO : Telangana Elections : మోగిన తెలంగాణ ఎన్నికల నగారా

ఎంపిక విధానానికి సంబంధించి ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. దరఖాస్తుల పరిశీలన స్ధలం: ఎలకా్ట్రనిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, కార్పొరేట్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, నలంద కాంప్లెక్స్‌, టీఐఎ్‌ఫఆర్‌ రోడ్‌, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబరు 10 గా నిర్ణయించారు. ధ్రువపత్రాల పరిశీలన అక్టోబరు 16 నుంచి 21 వరకు జరుగుతుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ecil.co.in/ పరిశీలించగలరు.