SAIL Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ

ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా క్లియర్ చేసినవారు అర్హులు.

SAIL Recruitment

SAIL Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 336 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వాటిలో ట్రేడ్ అప్రెంటిస్-152 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్- 136 , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 48 ఖాళీగా ఉన్నాయి.

READ ALSO : Reliance Jio Data Offer : జియోకు 7 ఏళ్లు.. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లపై 21GB డేటా ఉచితం.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టులకు, గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి డిప్లొమా క్లియర్ చేసినవారు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఫీల్డ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత ఉన్నవారు అధికారిక పోర్టల్ www.apprenticeshipindia.gov.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30గా నిర్ణయించారు.

READ ALSO : AP CID : చంద్రబాబు ఐటీ స్కామ్‌లో ట్విస్ట్.. రంగంలోకి ఏపీ సీఐడీ, త్వరలో దుబాయ్‌కు విచారణ బృందం

దరఖాస్తు చేసుకునే విధానం ;

  1. ముందుగా అధికారిక పోర్టల్www.apprenticeshipindia.gov.in ఓపెన్ చేయాలి.

2. తరువాత హోమ్‌పేజీలోకి వెళ్లి, సెయిల్ అప్రెంటిషిప్-2023 అనే లింక్‌పై క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ముందుగా చూడాలి.

3. అర్హత ఉన్న అప్రెంటిస్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోసుకునేందుకు ఎంచుకోవాలి. అనంతరం అభ్యర్థులు మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత                  వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.

4. తరువాత రిజిస్టర్ ఐడీ, పాస్ వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అప్రెంటిస్ ఆపర్చునిటిస్’ అనే లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫారమ్ ఓపెన్                     అవుతుంది.

5. అక్కడ అన్ని వివరాలను ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.