స్టార్టింగ్ శాలరీనే రూ.65వేలు.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో జాబ్స్.. క్వాలిఫికేషన్, అప్లికేషన్.. ఫుల్ డిటెయిల్స్..

బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర (Bank of maharashtra) భారీ సంఖ్య‌లో ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

Bank of maharashtra 500 Generalist officer vacancies Recruitment 2025 notification out

Bank of maharashtra : చాలా మందికి బ్యాంక్‌లో ఉద్యోగం చేయాల‌నే కోరిక ఉంటుంది. అలా మీకు బ్యాంక్‌లో ఉద్యోగం చేయాల‌ని ఉందా? ఇది మీకో అద్భుత అవ‌కాశం. బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర (Bank of maharashtra) భారీ సంఖ్య‌లో ఉద్యోగ నియామ‌క నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. 500 జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భ‌ర్తీని చేప‌ట్టింది. ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఆగ‌స్టు 30 లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైతే.. నెల‌కు రూ. 64,820 నుండి రూ. 93,960 వరకు జీతంగా లభిస్తుంది.

నోటీఫికేష‌న్ వివ‌రాలు ఇవే..

పోస్టులు..
500 జ‌న‌ర‌లిస్ట్ (ఎస్సీ 75, ఎస్టీ 37, ఓబీసీ 135, ఈడ‌బ్ల్యూఎస్ 50, అన్‌రిజ్వ‌ర్‌డ్ 203, పీడ‌బ్ల్యూబీడీ 15)

విద్యార్హ‌త‌లు..
జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు అయితే .. ఏదైన యూనివ‌ర్సిటీ నుంచి క‌నీసం 60 శాతం మార్కుల‌తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడ‌బ్ల్యూబీడీ అభ్య‌ర్థులు అయితే 55 శాతం మార్కుల‌తో ఏదైన డిగ్రీలో ఉత్తీర్ణ‌త సాధించాలి.

వ‌యోప‌రిమితి…
క‌నిష్ఠ వ‌యోప‌రిమితి 22 ఏళ్లు కాగా.. గ‌రిష్ట వ‌యోప‌రిమితి 35 ఏళ్లు. నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి సంబంధిత వ‌ర్గాల‌కు వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపు ఉంటుంది.

IB Recruitment 2025: పది పాసైతే చాలు.. ఇంటలీజెన్స్ బ్యూరో లో జాబ్స్.. నెలకు రూ.69 వేల జీతం.. ఒక్క క్లిక్ తో వెంటనే అప్లై చేసుకోండి

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ.. 2025 ఆగస్టు 13
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ.. 2025 ఆగ‌స్టు 30.

అప్లికేష‌న్ ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూబీడీ అభ్య‌ర్థుల‌కు రూ.118, అన్‌రిజ‌ర్వ్‌డ్‌, ఈడ‌బ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.1180

పరీక్ష తేదీ : తరువాత తెలియజేస్తారు

సెల‌క్ష‌న్ ప్రాసెస్‌..
రెండు ద‌శ‌ల్లో సెల‌క్ష‌న్ ప్రాసెస్ ఉంటుంది. మొద‌ట ఆన్‌లైన్ టెస్ట్‌ను నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారి నుంచి 1:3 నిష్ప‌త్తిలో ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్ష‌కు 150, ఇంట‌ర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు.

మ‌రిన్ని వివ‌రాల‌కు www.bankofmaharashtra.in వెబ్ సైట్‌ను సంద‌ర్శించ‌గ‌ల‌రు.