Bank of Maharashtra Recruitment
Bank of Maharashtra Recruitment : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 400 ఆఫీసర్ స్కేల్ 2, 3 పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Guava Cultivation : జామ సాగులో సస్యరక్షణ , తెగుళ్ళు..
భర్తీ చేయనున్న పోస్టుల్లో ఆఫీసర్ స్కేల్-3 పోస్టులు 100, ఆఫీసర్ స్కేల్-2 పోస్టులు 300 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా సీఏ,సీఎంఏ,సీఎఫ్‌ఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
READ ALSO : Winter Immunity Booster : చలికాలంలో ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా రోగనిరోధక శక్తిని పెంచే బత్తాయి!
అభ్యర్ధుల వయస్సుకు సంబంధించి ఆఫీసర్ స్కేల్-3 పోస్టులకు వయసు 25 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కేల్-3 పోస్టులకు నెలకు రూ.63,840 నుంచి రూ.78,230 వరకు జీతంగా చెల్లిస్తారు. స్కేల్-2 పోస్టులకు నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు జీతంగా చెల్లిస్తారు.
READ ALSO : Green Malta farming : బత్తాయి సాగులో యాజమాన్య పద్ధతులు !
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు జులై 25, 2023వ తేదీ లోగా పంపాల్సి ఉంది. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరీలకు చెందిన వారు రూ.1180, ఎస్సీ,ఎస్టీ,వికలాంగ అభ్యర్ధులు రూ.118 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bankofmaharashtra.in/ పరిశీలించగలరు.