BEML Jobs: beml has released a notification for non-executive posts.
BEML Jobs: ఐటీఐ పూర్తి చేసి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML Jobs) వివిధ ట్రేడుల్లో 440 నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. కాబట్టి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.bemlindia.in/ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.
పోస్టులు, ఖాళీల వివరాలు:
విద్యార్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NCT) కూడా తప్పకుండా ఉండాలి.
వయోపరిమితి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 29 ఏళ్లు మించకూడదు
ఎంపిక ప్రక్రియ: ఈ పోస్టుల కోసం రెండు భాగాల్లో ఎంపిక జరుగుతుంది. ఒకటి రాతపరీక్ష, రెండవది డాక్యుమెంట్ వెరిఫికేషన్