Bhabha Atomic Research Center
BARC Recruitment : ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 ఖాళీల భర్తీ చేయనున్నారు. అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
READ ALSO : Gaddar: 1997లో గద్దర్‌పై హత్యాయత్నం.. దేశ వ్యాప్తంగా సంచలనం
అభ్యర్ధుల అర్హతలకుసంబంధించి సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు జూనియర్ రిసెర్చ్ కోసం అర్హత కలిగిన ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. కనీసం 60% మార్కులతో బీఎస్సీ, 55% మార్కులతో ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ యూజీసీ, సీఎస్‌ఐఆర్,నెట్ ఫెలోషిప్, జెస్ట్ స్కోర్, ఐసీఎంఆర్, జేఆర్‌ఎఫ్ టెస్ట్, ఐసీఏఆర్- జేఆర్‌ఎఫ్ టెస్ట్, డీబీటీ-జేఆర్‌బీ బెట్, గేట్ స్కోర్ సాధించి ఉండాలి.
READ ALSO : Gaddar Death : ప్రజా ఉద్యమాలు, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసింది- గద్దర్ మృతికి చంద్రబాబు సంతాపం
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలు మించరాదు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుండి మినహాయింపు ఉంటుంది. ఫెలోషిఫ్ గా నెలకు రూ.31,000 – రూ.35,000 చెల్లిస్తారు.
READ ALSO : Gaddar in movies : పొడుస్తున్న పొద్దులా.. తెలుగు సినిమా తెరపై చిరస్మరణీయం గద్దర్ పాట
అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదిగా 31.08.2023. నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.barc.gov.in/ పరిశీలించగలరు.