BEL Recruitment
BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) ఘజియాబాద్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 95 ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Girl Challenge Viral : తుమ్మినపుడు కళ్లు మూయనని ఛాలెంజ్ చేసింది.. ఆ తరువాత ఏమైందంటే?
విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే హ్యూమన్ రిసోర్స్- 03, ఫైనాన్స్- 05, ఎలక్ట్రానిక్స్- 30, కంప్యూటర్ సైన్స్- 17,కంప్యూటర్ సైన్స్- 08, ఎలక్ట్రానిక్స్- 29, మెకానికల్- 03 పోస్టులు ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీంతోపాటు పని అనుభవం కలిగి ఉండాలి.
READ ALSO : Job Vacancies : కేంద్రప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28-32 సంవత్సరాలు మధ్య ఉండాలి.రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజుగాను ట్రైనీ ఇంజినీర్/ ఆఫీసర్‌కు రూ.150, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.400.గా నిర్ణయించారు. అభ్యర్థులు సెప్టెంబరు 07 దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.