Girl Challenge Viral : తుమ్మినపుడు కళ్లు మూయనని ఛాలెంజ్ చేసింది.. ఆ తరువాత ఏమైందంటే?

తుమ్మును ఆపుకుంటే ప్రాణాలు పోతాయని.. కంటి నరాలు దెబ్బ తింటాయని అంటారు. అందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ.. ఓ అమ్మాయి తుమ్మినపుడు కన్ను మూయకుండా ఉండే ఛాలెంజ్‌కు తెర లేపింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Girl Challenge Viral : తుమ్మినపుడు కళ్లు మూయనని ఛాలెంజ్ చేసింది.. ఆ తరువాత ఏమైందంటే?

Girl Challenge Viral

Updated On : August 25, 2023 / 3:59 PM IST

Girl Challenge Viral : తుమ్ము వచ్చినపుడు మీ హావభావాలు గుర్తు చేసుకోండి. ముఖ్యంగా తుమ్ము వచ్చినపుడు కళ్లు తెరిచి ఉంచడం సాధ్యమయ్యే పని కాదు. కానీ సాధ్యమని నిరూపించింది ఓ అమ్మాయి. అందుకోసం ప్రత్యేకంగా ఫీట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Bless You : తుమ్మితే ‘గాడ్ బ్లెస్ యూ’ అంటారెందుకు?

తుమ్ము మీద కొన్ని నమ్మకాలు ఉన్నాయి. పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే ఆ పని జరగదని.. గడప మీద కూర్చుని తుమ్మకూడదని ఇలా చెబుతుంటారు. అలాంటి సమయంలో అవతలివారు తిట్టుకోకూడదని తుమ్ముని బలవంతంగా ఆపుకోవాలని కొందరు ప్రయత్నిస్తారు.  అలా తుమ్మును ఆపుకోకూడదని.. తుమ్ము ఆపుకుంటే కంటి నరాలు దెబ్బతింటాయని.. రకరకాలుగా చెబుతుంటారు. ఇవన్నీ ఇలా ఉంచితే అసలు తుమ్ము వచ్చినపుడు కళ్లు మూయకుండా ఉండగలమా? అనే ఆలోచన వచ్చింది ఓ అమ్మాయికి. సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లకు కొదవ లేదు కాబట్టి తను ఛాలెంజ్‌గా తీసుకుంది. ఆలస్యం చేయకుండా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంక నెటిజన్ల రియాక్షన్ ఓ రేంజ్‌లో ఉంది.

Easiest Ways To Sneeze : తుమ్మేందుకు ప్రయత్నిస్తున్నా తుమ్మురావటంలేదా? తుమ్మడానికి సులభమైన మార్గాల ఇవే !

_bela_amor అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తుమ్మురావడం కోసం పెన్ ముక్కులో పెట్టుకుని ప్రయత్నం చేసింది. తుమ్మురాగానే కళ్లు మూయకుండా తుమ్మగలిగింది. కనురెప్పలు కాస్త కదిలినట్లు వీడియోలో కనిపిస్తుంది. అంతకు మించి ఏమీ జరగలేదు. ఛాలెంజ్ పూర్తి కాగానే ఆమెకు విపరీతంగా నవ్వొచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘కొన్ని నకిలీ వీడియోలను పోస్ట్ చేసే వ్యక్తుల కంటే ఇలాంటి అసలైన వీడియోలు ఫన్నీగా ఉంటాయని’ .. ‘తుమ్ము తెప్పించుకోవడానికి మేకప్ బ్రష్‌ను వాడాలా?’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Isabela Barbosa (@_bela_amor)