BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

Bharat Electronics Limited Job Vacancies

BEL Recruitment : భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పుణెలోనే సంస్ధలో పలు విభాగాల్లో ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హెచ్‌ఆర్‌ విభాగాల్లో ఉన్న ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి.

READ ALSO : Almonds : అధిక బరువును తగ్గించే బాదంపప్పు !

ట్రెయినీ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టుల ఆధారంగా 28 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000 నుంచి రూ. 40,000 వరకు చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 08 మార్చి 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.