BHEL Recruitment
BHEL Recruitment : భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) బెంగళూరులోన తాత్కాలిక ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ప్రాజెక్ట్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. రెండు సంవత్సరాల కాల వ్యవధికి ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్ధులు కొనసాగాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Feeling Hungry : జంక్ ఫుడ్ , చక్కెర ఆహారాలు తినాలన్న కోరికలు తగ్గించుకోవాలనుకుంటే ?
దరఖాస్తు చేసుకునే అభ్యరధుల అర్హతలకు సంబంధించి ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణలై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్ సూపర్‌వైజర్స్ కు 60 శాతం మార్కులతో డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
READ ALSO : Revanth Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?
వయోపరిమితి 32 సంవత్సరాలకు మించరాదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు నెలకు రూ.46,130 వేతనంగా చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 1 దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదిగా నిర్ణయించారు. నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ednnet.bhel.in/