BOB Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం దరఖాస్తును త్వరలో ముగించనుంది.
ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2025 కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా (bankofbaroda.in) అధికారిక వెబ్‌సైట్ ద్వారా జనవరి 17,2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు రుసుము :
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు పన్నులు, చెల్లింపు గేట్‌వే ఛార్జీలతో పాటు రూ. 600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాలి.
బీఓబీ ఎస్ఓ పోస్ట్‌లకు ఎలా దరఖాస్తు చేయాలి? :
అధికారిక వెబ్‌సైట్ (bankofbaroda.in)ని విజిట్ చేయండి.
హోమ్‌పేజీలో, లింక్ “Career” ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆపై “Current Opportunities” ట్యాబ్‌పై క్లిక్ చేయండి
ఇప్పుడు “వివిధ విభాగాల్లో రెగ్యులర్ బేసిస్‌లో ప్రొఫెషనల్స్ రిక్రూట్‌మెంట్” లింక్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు “Apply Now” ట్యాబ్‌ని క్లిక్ చేసి, ఆపై కొత్త రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ పేరు, మొబైల్ నంబర్, ఇతర అవసరమైన వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి
పూర్తయిన తర్వాత, మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో మీ అకౌంట్లో లాగిన్ అవ్వండి
ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
దరఖాస్తు రుసుమును చెల్లించండి.
దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింటౌట్ తీసుకోండి.
బీఓబీ ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2025 : ఖాళీలివే :
సంస్థలో 1267 మేనేజర్లు, ఇతర పోస్టుల భర్తీకి బ్యాంక్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.
గ్రామీణ అండ్ అగ్రి బ్యాంకింగ్ : 200 పోస్టులు
రిటైల్ బాధ్యతలు : 450 పోస్ట్‌లు
ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ : 341 పోస్టులు
సమాచార భద్రత : 9 పోస్టులు
ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ : 22 పోస్టులు
కార్పొరేట్ అండ్ సంస్థాగత క్రెడిట్ : 30 పోస్టులు
ఫైనాన్స్ : 13 పోస్టులు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ : 177 పోస్టులు
ఎంటర్‌ప్రైజ్ డేటా మేనేజ్‌మెంట్ ఆఫీస్ : 25 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎస్ఓ రిక్రూట్‌మెంట్ 2025 ఆప్షన్ ప్రక్రియ :
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ పరీక్ష కోసం అవసరమని భావించే ఏదైనా ఇతర అసెస్‌మెంట్ ఉండవచ్చు.
ఆ తర్వాత ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం గ్రూప్ డిస్కషన్/లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షలో 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 225 మార్కులు ఉంటాయి. 150 నిమిషాల పాటు కొనసాగుతాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ మినహా అన్ని సెక్షన్లు, ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.