SSC GD Constable Admit Card 2025 : త్వరలో ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డు విడుదల.. డౌన్‌లోడ్ చేయాలంటే?
SSC GD Constable Admit Card 2025 : ఈ కానిస్టేబుల్ పోస్టుల కచ్చితమైన తేదీ, సమయం వివరాల కోసం హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SSC GD Constable Admit Card 2025
SSC GD Constable Admit Card 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లోని SSF, రైఫిల్‌మ్యాన్ (GD), సిపాయిల కోసం రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌లను త్వరలో విడుదల చేయనుంది.
ఈ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కచ్చితమైన తేదీ, సమయం వివరాలను తెలుసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in)నుంచి హాల్ టిక్కెట్‌లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్ఎస్‌సీ కానిస్టేబుల్ జీడీ పరీక్ష 2025 ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, ఫిబ్రవరి 25,2025 తేదీల్లో జరగాల్సి ఉంది. అడ్మిట్ కార్డ్ విడుదలైన తర్వాత అభ్యర్థులు సాధారణ దశలను అనుసరించడం ద్వారా వారి ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ 2025 అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోగలరు.
ఎస్ఎస్‌సీ జీడీ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
అధికారిక వెబ్‌సైట్ (ssc.gov.in)ను సందర్శించండి.
హోమ్‌పేజీలో, “అడ్మిట్ కార్డ్” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు, మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.
లాగిన్ బటన్‌పై క్లిక్ చేయండి.
మీ ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది.
హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసి, పరీక్ష రోజు కోసం ప్రింటవుట్ తీసుకోండి.
ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ 2025 ఖాళీలివే :
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మొత్తం 39,481 కానిస్టేబుల్ (GD) పోస్టులను సీఏపీఎఫ్, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్‌లో సిపాయిలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
BSF : 15654 పోస్టులు
CISF : 7145 పోస్టులు
CRPF : 11541 పోస్టులు
SSB : 819 పోస్టులు
ITBP : 3017 పోస్ట్‌లు
AR : 1248 పోస్ట్‌లు
SSF : 35 పోస్టులు
NCB : 22 పోస్టులు
ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్ష 2025 :
కమిషన్ ఎస్ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ 2025 పరీక్షను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (CBE)మోడ్‌లో ఇంగ్లీష్, హిందీ, 13 ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తుంది. (i) అస్సామీ, (ii) బెంగాలీ, (iii) గుజరాతీ, (iv) కన్నడ, (v) కొంకణి, (vi) మలయాళం, (vii) మణిపురి, (viii) మరాఠీ, (ix) ఒడియా, (x) పంజాబీ, (xi) తమిళం, (xii) తెలుగు (xiii) ఉర్దూ.
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 2 మార్కులతో 80 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.