CA Final Exam Results Expected To Be Out By December 26
CA Final Exam Results : ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) డిసెంబర్ చివరి నాటికి సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది. ఐసీఏఐకి చెందిన ఒక అధికారి ట్విట్టర్ వేదికగా ఫలితాల విడుదలకు సంబంధించిన తాత్కాలిక తేదీపై పోస్ట్ చేశారు. ధీరజ్ ఖండేల్వాల్ ప్రకారం.. డిసెంబర్ చివరి వారంలో సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సీఏ ఫలితాల షెడ్యూల్ తేదీ డిసెంబర్ 26, 2024గా నిర్ణయించారు.
“ఐసీఏఐ ఫైనల్ రిజల్ట్స్ డిసెంబర్ చివరి వారంలో విడుదల అవుతాయని అంచనా. ఆరోజు సాయంత్రం నాటికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది” అని పోస్ట్ పేర్కొంది. ఫలితాల విడుదల తర్వాత పరీక్షలో హాజరైన అభ్యర్థులు లాగిన్ వివరాలను ఉపయోగించి ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేయాలి. సీఏ ఫైనల్ పరీక్షలు నవంబర్ 3-14, 2024 వరకు నిర్వహించారు. గ్రూప్-I పరీక్షలు నవంబర్ 3, 5, 7, 2024 తేదీల్లో నిర్వహించగా, గ్రూప్ II పరీక్షలు నవంబర్ 9, 11, 14 తేదీల్లో నిర్వహించారు.
ఐసీఏఐ సీఏ ఫైనల్ 2024 ఫలితాలు :
అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల కారణంగా ఐసీఏఐ గతంలో 5 కేంద్రాల్లో చార్టర్డ్ అకౌంటెన్సీ పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. నవంబర్ 13న హజారీబాగ్ (జార్ఖండ్), జంషెడ్‌పూర్ (జార్ఖండ్), రాంచీ (జార్ఖండ్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), జుంఝును (రాజస్థాన్)లలో నిర్వహించాల్సిన పరీక్షను ఇన్‌స్టిట్యూట్ నవంబర్ 14, 2024కి వాయిదా వేసింది.