CAT 2024 : క్యాట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
CAT 2024 Final Answer Key : కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024 కోసం ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (iimcat.ac.in)ని విజిట్ చేయడం ద్వారా ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

CAT 2024 Final Answer Key
CAT 2024 Final Answer Key : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), కలకత్తా, కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2024 కోసం ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (iimcat.ac.in)ని విజిట్ చేయడం ద్వారా ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
క్యాట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ: డౌన్‌లోడ్ చేయాలంటే?
- అధికారిక వెబ్‌సైట్ (iimcat.ac.in)కి వెళ్లండి.
- హోమ్‌పేజీలో క్యాట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ లింక్‌ని గుర్తించి, క్లిక్ చేయండి.
- క్లిక్ చేసిన తర్వాత, మీ స్క్రీన్‌పై కొత్త పేజీ కనిపిస్తుంది.
- మీ వివరాలతో లాగిన్ చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
- మీ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత ఆన్సర్ కీ మీ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. “ఆబ్జెక్షన్ మేనేజ్‌మెంట్ ఎక్సర్‌సైజ్ డిసెంబర్ 3, 2024 నుంచి డిసెంబర్ 5, 2024 వరకు అందుబాటులో ఉంది. క్యాట్ సెంటర్‌కి 3 సెక్షన్లు, 3 షిఫ్ట్‌లలో మొత్తం 405 అభ్యంతరాలు వచ్చాయి. క్యాట్ 2024 కోసం సెక్షనల్ రివ్యూ నిపుణుల ప్యానెల్‌లు ఈ విండోలో స్వీకరించిన అన్ని అభ్యంతరాలను సమీక్షించారు. క్యాట్ ఫలితాలు జనవరి 2025 రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది. క్యాట్ 2024 స్కోర్ డిసెంబర్ 31, 2025 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
క్యాట్ 2024లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అందించే ఫ్లాగ్‌షిప్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లకు కూడా అర్హులు. క్యాట్ 2024 దేశవ్యాప్తంగా 389 పరీక్షా కేంద్రాలలో నవంబర్ 24, 2024న నిర్వహించారు.
ఈ పరీక్షకు మొత్తం 3.29 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, అందులో దాదాపు 2.93 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షకు మొత్తం 89 శాతం హాజరు నమోదైంది. అభ్యర్థులు లేటెస్ట్ సమాచారం కోసం క్యాట్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని ప్రోత్సహిస్తున్నారు.