CBSE Class 10 And 12 Exams 2025 ( Image Source : Google )
CBSE Exams 2025 : సీబీఎస్ఈ బోర్డు 10వ, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ త్వరలో 10వ, 12వ తరగతుల తేదీ షీట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్ష 2025 తేదీ షీట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక వెబ్‌సైట్ (cbse.gov.in)లో చెక్ చేయవచ్చు. మీడియా నివేదికల ప్రకారం.. సీబీఎస్ఈ బోర్డు పరీక్ష తేదీ షీట్ త్వరలో విడుదల కానుంది.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15, 2025న ప్రారంభమవుతాయి. 10వ తరగతి, 12 తరగతులకు సంబంధించిన రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ 2025కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లు, సబ్జెక్ట్ వారీగా వివరణాత్మక తేదీ షీట్‌ను (cbse.gov.in)లో చెక్ చేయండి. విద్యార్థులు ఎలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు. సీబీఎస్ఈ బోర్డు పరీక్ష తేదీ షీట్‌కు సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే.. స్కూల్ యాజమాన్యంతో నేరుగా మాట్లాడవచ్చు.
నివేదికల ప్రకారం.. 2025లో, 10వ తరగతి, 12 తరగతులకు చెందిన 44 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్షకు హాజరు కానున్నారు. వీరంతా ప్రస్తుతం సీబీఎస్ఈ బోర్డ్ పరీక్ష తేదీ షీట్ 2025 (సీబీఎస్ఈ బోర్డ్ 10వ, 12వ పరీక్ష 2025 తేదీ షీట్) విడుదల కోసం వేచి ఉన్నారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు విదేశాలతో పాటు భారత్‌లో కూడా జరుగుతాయి. అనేక దేశాల్లో సీబీఎస్ఈ బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అదే సమయంలో పరీక్షలు కూడా ఉంటాయి. 2023లో సీబీఎస్ఈ బోర్డ్ 10, 12 పరీక్షల తేదీ షీట్ డిసెంబర్ మధ్యలో విడుదల చేసింది.
సీబీఎస్ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు:
సీబీఎస్ఈ బోర్డు మెయిన్ పరీక్షలకు ముందు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనుంది. సీబీఎస్ఈ బోర్డ్ నోటిఫికేషన్ ప్రకారం.. శీతాకాలపు పాఠశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు, అంతర్గత మూల్యాంకనం నవంబర్ 5, డిసెంబర్ 5 మధ్య నిర్వహించనున్నారు. అదే సమయంలో, ఇతర పాఠశాలల్లో సీబీఎస్ఈ బోర్డు ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 1న ప్రారంభమవుతాయి. సీబీఎస్ఈ బోర్డు పరీక్షా విధానం, మార్కింగ్ స్కీమ్ (cbse.gov.in)లో మాత్రమే చెక్ చేయవచ్చు. సీబీఎస్ఈ బోర్డు నమూనా పేపర్ 2025ని (cbseacademic.nic.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డేట్ షీట్‌ను డౌన్‌లోడ్ చేయాలంటే? :
సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ 2025 తేదీ షీట్‌ను ఈ కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ 2025 తేదీ షీట్ విడుదలైన తర్వాత డౌన్‌లోడ్ చేసుకునేందుకు (www.cbse.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. వెబ్‌సైట్ హోమ్‌పేజీలో, “Exam” ట్యాబ్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత, మీరు సీబీఎస్ఈ బోర్డ్ పరీక్ష తేదీ షీట్ 2025 ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత, షెడ్యూల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సబ్జెక్ట్ వారీ తేదీలను చెక్ చేయడం ద్వారా సీబీఎస్ఈ బోర్డు పరీక్ష తేదీ షీట్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సీబీఎస్ఈ బోర్డు పరీక్ష తేదీ షీట్ ప్రింటవుట్ తీసుకోండి.
Read Also : AI Death Calculator : మీరు ఎప్పుడు చనిపోతారో ఈ ఏఐ డెత్ కాలిక్యులేటర్ ముందే చెప్పేస్తుంది!