సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఖాళీలు

బిహార్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో టెక్నికల్ పోస్టులతోపాటు, స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. పోస్టుల ఆధారంగా విద్యార్హతలు నిర్ణయించారు.
పోస్టులవారీగా పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కొన్ని పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా, మరికొన్ని పోస్టులకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తు ఫీజు:
– టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
* ఖాళీల సంఖ్య:
– టెక్నికల్ పోస్టులు-93
– స్కిల్డ్ సపోర్టింగ్ స్టాఫ్: 100
– మొత్తం ఖాళీల సంఖ్య: 193
* టెక్నికల్ పోస్టుల వివరాలు..
పోస్టులు | ఖాళీలు |
ఎలక్ట్రీషియన్ | 03 |
ఫిట్టర్ | 02 |
ప్లంబర్ | 03 |
బ్లాక్‌స్మిత్ | 01 |
ఫార్మ్ మెకానిక్ | 03 |
కుక్ | 08 |
లైవ్ స్టాక్ అసిస్టెంట్ | 02 |
డ్రైవర్ | 02 |
నర్సింగ్ అసిస్టెంట్ | 02 |
ఫార్మాసిస్ట్ | 02 |
ఫీల్డ్ టెక్నీషియన్ | 13 |
లైబ్రరీ టెక్నీషియన్ | 20 |
పాథాలజీ టెక్నీషియన్ | 01 |
ఫొటోగ్రాఫర్ | 02 |
లైబ్రరీ అసిస్టెంట్ | 04 |
జూనియర్ ఇంజినీర్ (సివిల్) | 04 |
జూనియర్ ఇంజినీర్ (మెకానికల్) | 01 |
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) | 02 |
జూనియర్ ఇంజినీర్ (ఎలక్టానిక్స్) | 01 |
ఫార్మ్ పాండ్ మేనేజర్ | 01 |
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) | 02 |
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) | 01 |
అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్) | 01 |
ఫార్మ్ పాండ్ మేనేజర్ | 01 |
సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇంజినీర్ | 01 |
ఇన్‌ఫర్మేషన్ ఆఫీసర్ | 01 |
మొత్తం ఖాళీలు (టెక్నికల్) | 93 |
* అర్హత, వయోపరిమితి వివరాల కోసం క్లిక్ చేయండి..