Central Bank of India Recruitment
CBI Recruitment : ముంబాయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న రీజియన్లలోని సీబీ శాఖల్లో మొత్తం 5,000ల అప్రెంటిస్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలకు సంబంధించి తెలంగాణలో 106, ఆంధ్రప్రదేశ్‌లో 141 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 8వ/10వ/12వ తరగతి లేదా ఏదైనా డిగ్రీలో తెలుగు సబ్జెక్టుతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 20 నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు. అర్హత సాధించిన వారికి రూరల్ బ్రాంచ్ లో నెలకు రూ.10,000 , అర్బన్ బ్రాంచ్ లో రూ.12,000 , మెట్రో బ్రాంచ్ లో రూ.15,000 తోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
అప్రెంటిస్‌షిప్‌ను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అసెస్‌మెంట్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా థియరీ అసెస్‌మెంట్‌ను, ప్రాక్టికల్ అసెస్‌మెంట్‌ను సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తుంది. ఆర్హతలున్నఅభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 3, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ ; https://www.centralbankofindia.co.in/en/ పరిశీలించగలరు.