హెడ్ కానిస్టేబుల్ దరఖాస్తుకు నేడే ఆఖరు

  • Publish Date - February 20, 2019 / 06:56 AM IST

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) హెడ్ కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు బుధవారం (ఫిబ్రవరి 20, 2019)తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటర్ ఉత్తీర్ణత ఉండి, 18 – 25 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. SC, ST, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

మొత్తం 429 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి CISF నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. వీటిలో 328 పోస్టులు పురుషలకు కేటాయించగా.. 37 పోస్టులను మహిళలకు, 64 పోస్టులను LDCE కి కేటాయించారు.