Coca Cola: విద్యార్థుల నైపుణ్యం మెరుగుపరిచేందుకు మరో అడుగు ముందుకు వేసిన కొకా-కోలా

మరోవైపు హెచ్‌సీసీబీ కంటెంట్‌ను అభివృద్ధి చేయడం, శిక్షకులను గుర్తించడం, నిపుణులైన శిక్షకుల సమూహాన్ని సృష్టించడం, విస్తరించడం కోసం ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్ (TTT) నిర్వహించడం, వర్చువల్-ఫిజికల్ క్లాస్‌రూమ్ సెషన్‌లను నిర్వహించడం వంటి వాటిపై కూడా పని చేస్తారు.

Coca Cola: విద్యార్థుల నైపుణ్యం మెరుగుపరిచేందుకు మరో అడుగు ముందుకు వేసిన కొకా-కోలా

Updated On : July 17, 2023 / 9:33 PM IST

Skill Development: హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ అదనంగా మరో 10,000 మంది కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్య శాఖతో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు హెచ్‌సీసీబీ, తెలంగాణ ప్రభుత్వం కలిసి 2022లో తొలిసారి భాగస్వామ్యంతో సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 10196 మంది విద్యార్థులకు ప్రత్యే శిక్షణ ఇచ్చింది.

Singapore Politics: సింగపూర్ పార్లమెంట్ స్పీకర్, మంత్రి రాజీనామా.. ఇద్దరి మధ్య అనుచిత సంబంధమే కారణం

తెలంగాణ ప్రభుత్వ కార్మిక-ఉపాధి శాఖల మంత్రి సీ హెచ్ మల్లారెడ్డి సమక్షంలో హెచ్‌సీసీబీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఈకార్యక్రమాన్ని విస్తరించేందుకు ఒప్పదం కుదిరింది. ‘క్యాంపస్ టు కార్పోరేట్’ అని కూడా పిలువబడే ఈ కార్యక్రమం ద్వారా కళాశాల విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేయడం, నైపుణ్యాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. TASK విద్యార్థుల బ్యాచ్‌లను రూపొందించడం, భౌతిక తరగతి గది సెషన్‌ల కోసం ప్రాంతాలను గుర్తించడం, ఈ శిక్షణా సెషన్‌లు వంటి వాటి కోసం ప్రత్యేక క్యాలెండర్‌ను సిద్ధం చేసిన పని చేస్తారు.

Dr.RS Praveen Kumar : నేను లోకల్, ఆయన సెటిలర్- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మరోవైపు హెచ్‌సీసీబీ కంటెంట్‌ను అభివృద్ధి చేయడం, శిక్షకులను గుర్తించడం, నిపుణులైన శిక్షకుల సమూహాన్ని సృష్టించడం, విస్తరించడం కోసం ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్ (TTT) నిర్వహించడం, వర్చువల్-ఫిజికల్ క్లాస్‌రూమ్ సెషన్‌లను నిర్వహించడం వంటి వాటిపై కూడా పని చేస్తారు. కాగా, ఈ కార్యక్రమంలో పరిశ్రమలు & వాణిజ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జయేష్ రంజన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, హిందూస్థాన్‌ కోకా-కోలా బెవరేజెస్ చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి, హిందూస్థాన్‌ కోకా-కోలా బెవరేజెస్ హెడ్ – హెచ్ఆర్ చిత్ర గుప్తా సహా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.