సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 1412 కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే జనరల్ డ్యూటీ, బగ్లర్, మాలి, పెయింటర్ విభాగాల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ పురుషులు, మహిళా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవటానికి అభ్యర్దులకు ఎటువంటి ఫీజు లేదు.
విద్యార్హత : అభ్యర్ధులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు : అభ్యర్దుల వయసు 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపులు వర్తిస్తాయి.
ఎంపికా విధానం : అభ్యర్ధులను రాత పరీక్ష, ఫిజికల్ మెజర్ మెంట్ టెస్టు(పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు(పీఈటీ), మెడికల్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్దులకి జీతం రూ. 25,500 నుంచి రూ. 81,100 వరకు వస్తుంది.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 7, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 6, 2020.
పరీక్ష తేదీ : ఏప్రిల్ 19, 2020.