CTET Admit Card 2024 : సీటెట్ అడ్మిట్ కార్డ్ 2024 విడుదల.. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

CTET Admit Card 2024 : సీబీఎస్ఈ సీటెట్ అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in)లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. హాల్ టిక్కెట్‌ను అభ్యర్థులు సులభంగా డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు.

CTET Admit Card 2024

CTET Admit Card 2024 : సీబీఎస్ఈ సీటెట్ అడ్మిట్ కార్డ్ కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 14న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)ని నిర్వహించేందుకు సిద్ధమైంది.

సీబీఎస్ఈ సీటెట్ అడ్మిట్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్ (ctet.nic.in)లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. హాల్ టిక్కెట్‌ను యాక్సెస్ చేసేందుకు అభ్యర్థులకు వారి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ అవసరం. సీటెట్ 2024 హాల్ టికెట్ పరీక్ష తేదీకి రెండు రోజుల ముందు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

సీటెట్ అడ్మిట్ కార్డ్ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
సీటెట్ 2024 హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది.

  • సిటెట్ వెబ్‌సైట్ విజిట్ చేయండి :
  • సీటెట్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌తో లాగిన్ చేయండి.
  • హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పీడీఎఫ్‌గా సేవ్ చేసుకోండి.
  • పరీక్ష రోజు కాపీని ప్రింట్ చేయడం మర్చిపోవద్దు.

సీటెట్ 2024 పరీక్ష వివరాలు :
సీటెట్ పరీక్ష రెండు షిఫ్టులలో జరుగుతుంది.. పేపర్ 2 (ఉదయం) : ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 (మధ్యాహ్నం) : మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీటెట్ పరీక్షలో 150 మల్టీ-ఆప్షనల్ ప్రశ్నలు (MCQ) ఉంటాయి.

పేపర్ 1 చైల్డ్ డెవలప్‌మెంట్, పెడగోగి, రెండు తప్పనిసరి భాషలు. గణితం, పర్యావరణ అధ్యయనాలపై దృష్టి పెడుతుంది. పేపర్ 2లో ఒకే రకమైన అంశాలు ఉంటాయి. కానీ, అభ్యర్థి ఎంపికను బట్టి మ్యాథ్స్, సైన్స్ లేదా సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్‌ సబ్జెక్టులు ఉంటాయి.

సీబీఎస్ఈ ఇప్పటికే సీటెట్ 2024 సిటీ స్లిప్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమకు కేటాయించిన పరీక్ష జరిగే సిటీని చెక్ చేయవచ్చు. సీటెట్ అడ్మిట్ కార్డ్, హాల్ టిక్కెట్ ఎప్పుడు అనేదానిపై మరింత సమాచారం కోసం (ctet.nic.in) వెబ్‌సైట్ విజిట్ చేయండి.

Read Also : WhatsApp Video Call : వాట్సాప్ సరికొత్త అప్‌డేట్స్.. వీడియో కాలింగ్ ఫీచర్లు, ఫన్ ఎఫెక్ట్స్, మరెన్నో ఫీచర్లు..!