CUET PG Admit Card 2024 : ఎన్టీఏ సీయూఈటీ పీజీ అడ్మిట్ కార్డ్ 2024 విడుదల.. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!

CUET PG Admit Card 2024 : మార్చి 27న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ (CUET PG 2024) అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్‌ (pgcuet.samarth.ac.in) నుంచి డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు.

CUET PG Admit Card 2024 : ప్రముఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CUET) పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిట్ కార్డ్‌ను జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం మార్చి 27న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ (CUET PG 2024) అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్‌ (pgcuet.samarth.ac.in) నుంచి డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు.

Read Also : SBI Clerk Mains Result : అతి త్వరలో ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు.. ఇదిగో డైరెక్ట్ లింక్..!

పరీక్ష రోజున లేదా ముందు రోజున ఈ అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. అలాగే, దరఖాస్తుదారులు ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు అడ్మిట్ కార్డ్‌లో పేర్కొన్న అన్ని వివరాలను జాగ్రత్తగా చెక్ చేయాలని ఎన్టీఏ ఏజెన్సీ ఒక ప్రకటనలో సూచించింది.

సీయూఈటీ పీజీ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే?:

  • అధికారిక వెబ్‌సైట్‌ (pgcuet.samarth.ac.in)ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో ఉన్న ‘Download Admit Card’ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయండి.
  • మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌లపై వివరాలు డిస్‌ప్లే చేస్తుంది.
  • అన్ని వివరాలను క్రాస్ చెక్ చేయండి.
  • అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేయండి.
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

అడ్మిట్ కార్డ్ లేకుండా పరీక్ష కేంద్రానికి ప్రవేశం అనుమతి ఉండదు. మీరు పరీక్ష హాల్‌కు ఈ అడ్మిట్ కార్డును తీసుకురావాలి. సీయూఈటీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడంలో ఏవైనా సమస్యలు లేదా వివరాల్లో వ్యత్యాసాల కోసం అభ్యర్థులు ఎన్టీఏ హెల్ప్ డెస్క్‌ని 011-40759000లో సంప్రదించవచ్చు. cuetpg@nta.ac.inలో ఎన్టీఏకి ఇమెయిల్ పంపవచ్చు.

Read Also : ఏప్రిల్‌ 1 నుంచి క్రెడిట్ కార్డు కొత్త రూల్స్‌.. మీరు ఈ బ్యాంకు కార్డులను వాడుతున్నారా?

ట్రెండింగ్ వార్తలు