SBI Clerk Mains Result : అతి త్వరలో ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు.. ఇదిగో డైరెక్ట్ లింక్..!
SBI Clerk Mains Result : ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. అధికారిక తేదీ ఇంకా ధృవీకరించలేదు. కానీ, ఏ క్షణమైనా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.

SBI Clerk Mains Result 2024 to be declared anytime soon
SBI Clerk Mains Result : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అతి త్వరలో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల ఫలితాలను ప్రకటించనుంది. అయితే, ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2024 విడుదలకు సంబంధించిన అధికారిక తేదీ, సమయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు.
ఒకసారి ఫలితాలను ప్రకటించిన తర్వాత అభ్యర్థులు ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ స్కోర్‌కార్డ్‌ను (sbi.co.in)లో ఈ డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ 2024ని యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు పోర్టల్‌లో తమ అప్లికేషన్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను తప్పనిసరిగా అందించాలి. ఆ తర్వాత రిజల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలు 2024 డౌన్‌లోడ్ ఎలా? :
ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ ఫలితాలను డౌన్‌లోడ్ చేయడానికి ఈ కింది దశలను ఫాలో అవ్వండి.
- అధికారిక వెబ్‌సైట్ (sbi.co.in)ను విజిట్ చేయండి.
- ‘Current Openings’ సెక్షన్‌కు నావిగేట్ చేయండి.
- ‘రిక్రూట్‌మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)’ పేరుతో లింక్ క్లిక్ చేయండి.
- ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ స్కోర్‌కార్డ్ లింక్‌ని ఎంచుకుని అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి.
- రిజిస్టర్ చేసిన తర్వాత ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్స్ 2024 స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఈ రిక్రూట్‌మెంట్ ఎస్‌బీఐలో మొత్తం 8773 ఖాళీలను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 25, మార్చి 4, 2024న జరిగింది. ప్రస్తుతం ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ స్కోర్‌కార్డ్ 2024 కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఆన్‌లైన్ పరీక్ష ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఉంటాయి. అలాగే పేర్కొన్న లోకల్ లాంగ్వేజీలో భాషలో ప్రొఫెషియన్సీ టెస్టు ఉంటుంది.