ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఇంకా అప్లై చేసుకోలేదా? మీకో గుడ్‌న్యూస్‌

దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచిన నేపథ్యంలో దీనిపై ప్రచారం కల్పించాలని పేర్కొంది.

ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మీకో గుడ్‌న్యూస్‌. 2024-25 విద్యా సంవత్సరానికిగానూ పోస్టుమెట్రిక్ విద్యార్థులకు సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు గడువును తెలంగాణ సర్కారు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 31తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియాల్సి ఉంది. ఈ గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వులు ఇచ్చారు. గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Also Read: పడిపోనున్న బంగారు ఆభరణాల అమ్మకాలు

మొత్తం కలిపి 11,88,120 మంది స్టూడెంట్లు దరఖాస్తులు చేసుకుంటారని అధికారులు భావించగా.. ఇప్పటివరకు 10,75,041 మంది అప్లై చేసుకున్నారు. మరో 1,13,079 మంది స్టూడెంట్స్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

దరఖాస్తుల గడువును పెంచాలని విజ్ఞప్తులు రావడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాలేజీలు, సంక్షేమ శాఖల అధికారులకు సూచనలు చేస్తూ… గడువులోగా ప్రతి విద్యార్థి దరఖాస్తు చేసుకునేలా చూడాలని చెప్పింది. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచిన నేపథ్యంలో దీనిపై ప్రచారం కల్పించాలని పేర్కొంది.