Gold: పడిపోనున్న బంగారు ఆభరణాల అమ్మకాలు
గోల్డ్ బార్స్‌తో పాటు కాయిన్స్ డిమాండ్ సుమారు 10 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.

బంగారం ధరలు పెరిగిపోతుండడంతో నగల అమ్మకాలు కూడా తగ్గుతున్నాయి. 2025-2026 ఆర్థిక ఏడాది భారత్‌లో పసిడి నగల విక్రయాలు 9-10 శాతం తగ్గే అవకాశం ఉందని ఇక్రా (ICRA) తెలిపింది. బంగారం ధరలు 33 శాతం పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేసింది.
అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వాణిజ్య యుద్ధం ఆందోళనల వల్ల పెట్టుబడిదారులు బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ట్రెండ్ ఈ ఏడాది కూడా కొనసాగుతుందని చెప్పింది. గోల్డ్ బార్స్‌తో పాటు కాయిన్స్ డిమాండ్ సుమారు 10 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం
మొత్తం బంగారం డిమాండ్‌లో వీటి వాటా 35 శాతం ఉంటుందని చెప్పింది. గోల్డ్ అమ్మకాల వాల్యూమ్స్ తగ్గుతున్నప్పటికీ బంగారు ఆభరణాల విక్రయాల విలువ మాత్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12-14 శాతం పెరుగుతుందని చెప్పింది. బంగారం ధరలు పెరగడమే ఇందుకు కారణం.