Free Training: టెన్త్ పాసైనవారికి బంపర్ ఆఫర్.. వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ.. వెంటనే అప్లై చేసుకోండి

Free Training: కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ఈజిఎం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ

Free Training: టెన్త్ పాసైనవారికి బంపర్ ఆఫర్.. వివిధ రంగాల్లో ఉచిత శిక్షణ.. వెంటనే అప్లై చేసుకోండి

Deen Dayal Upadhyaya Grameen Kaushalya Yojana Free Training

Updated On : July 31, 2025 / 12:06 PM IST

మీరు టెన్త్ ఆపై చదువులు పూర్తి చేసి మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా. అయితే ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. మహబూబాబాద్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ వృత్తి నైపుణ్య ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్. సతీష్ కుమార్ అధికారిక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ఈజిఎం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

మూడు నెలల పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో ఉచిత శిక్షణ అందజేయనున్నారు. బిపిఓ వాయిస్, లాజిస్టిక్, హెల్త్ కేర్, కంప్యూటర్ ట్రైనింగ్, ఎలక్ట్రానిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, హార్డ్ వెర్ వంటి కోర్సుల్లో ఉచిత శిక్షణ అందించనున్నారు. కాబట్టి, యువత ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

విద్యార్హత: పదవ తరగతి ఆపై చదువులు పూర్తి చేసిన అభ్యర్థులు ఎవరైనా ఈ ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చు.

వయోపరిమితి: 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న గ్రామీణ యువత, మహిళలు ఈ ఉచిత శిక్షణలో పాల్గొనవచ్చు. కేటగిరీ ప్రకారం ఎస్సీ అభ్యర్థులకు 45 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

శిక్షణ వివారాలు: అభ్యర్థులకు ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు, శిక్షణ కాలంలో భోజన సౌకర్యం కూడా అందజేస్తారు.

కాబట్టి మహబూబాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాలు, సందేహాల కోసం 98498 69694, 94901 09490 నెంబర్ లను సంప్రదించవచ్చు.