టెన్త్ పాసైతే చాలు.. DRDOలో 1817 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు

  • Publish Date - December 13, 2019 / 07:55 AM IST

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నిరుద్యోగుల కోసం ఏకంగా 1817 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల్ని భర్తీ చేసింది. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ CEPTAM ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విద్యార్హత:
అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత అయి ఉండాలి.

వయస్సు: 
అభ్యర్ధులు 18 నుంచి 25 ఏళ్లు వయసు ఉండాలి. ST, SC వారికి వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: 
అభ్యర్ధులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, OBC అభ్యర్థులు మాత్రం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.  

ముఖ్యతేదిలు: 
దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 23, 2019. 
దరఖాస్తు చివరి తేదీ: జనవని 23, 2020.