NIT Durgapur Recruitment : దుర్గాపూర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్,/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో రీసెర్చ్‌ అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

NIT Durgapur Recruitment : దుర్గాపూర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒప్పంద ఉద్యోగాల భర్తీ

Durgapur National Institute of Technology

Updated On : September 4, 2022 / 1:47 PM IST

NIT Durgapur Recruitment : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ టెక్నికల్ అసోసియేట్, టెక్నికల్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్,/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో రీసెర్చ్‌ అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.40,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను మెయిల్‌ ఐడీకి పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను సెస్టెంబర్‌ 15, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పంపాల్సి ఉంటుంది.ఈ మెయిల్‌ ఐడీ: deanresearch@admin.nitdgp.ac.in, పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nitdgp.ac.in/పరిశీలించగలరు.