EMRS 2025 Notification: 7వేల పోస్టులు.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, జీతం, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు..

సెప్టెంబర్ 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

EMRS 2025 Notification: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ లో (EMRS) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టులు 7,267. ఇందులో టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ ఉద్యోగాలు ఉన్నాయి. అర్హతలు, ఫీజు, జీతం, దరఖాస్తు విధానం తదితర వివరాల గురించి తెలుసుకుందాం..

డిగ్రీ, పీజీ, బీఎడ్, డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. సెప్టెంబర్ 19 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే అప్లికేషన్ సమర్పించాలి.

PGT 1,460, TGT 3,962, ప్రిన్సిపల్​ 225, హాస్టల్ వార్డెన్​ 346, జూనియర్​ క్లర్క్​​ 228, అకౌంటెంట్​ 61, స్టాఫ్​ నర్స్​ 550, ఫీమేల్​ వార్డెన్ ​289, ల్యాబ్​ అటెండెంట్​ 146 పోస్టులున్నాయి. పూర్తి వివరాలకు https://nests.tribal.gov.inను సంప్రదించండి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అర్హత:
పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్‌, ఇంటర్‌, టెన్త్‌, డిప్లొమాలో పాస్ అయి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి:
ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు
పీజీటీకి 40 ఏళ్లు
టీజీటీకి 35 ఏళ్లు
అకౌంటెంట్‌కు 30 ఏళ్లు
ల్యాబ్‌ అటెండెంట్‌కు 30 ఏళ్లు
హాస్టల్‌ వార్డెన్‌, ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌కు 35 ఏళ్లు
జూనియర్ సెక్రటేరియట్‌ అటెండెంట్‌కు 30 ఏళ్లు.

జీతం: నెలకు
ప్రిన్సిపల్‌కు రూ.78,800 – రూ.2,09,200
పీజీటీకి రూ.47,600 – రూ.1,51,100
టీజీటీకి రూ.44,900 – రూ.1,42,400
అకౌంటెంట్‌కు రూ.35,400 – రూ.1,12,400
ల్యాబ్‌ అటెండెంట్‌కు రూ.18,000 – రూ.56,900
హాస్టల్‌ వార్డెన్‌కు రూ.29,200 – రూ.92,300
ఫీమేల్‌ స్టాఫ్‌ నర్స్‌కు రూ.29,200 – రూ.92,300
జూనియర్ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200.

దరఖాస్తు ఫీజు:
* జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ప్రిన్సిపల్‌ పోస్టుకు రూ.2,500
* టీజీటీ, పీజీటీ పోస్టులకు రూ.2,000
* నాన్‌-టీచింగ్‌ పోస్టులకు రూ.1,500
* ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌, మహిళా అభ్యర్థులకు రూ.500.

Also Read: RRB అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష తేదీ ఖరారు.. ఎగ్జామ్ షెడ్యూల్ డౌన్‌లోడ్ ఇలా..