EIL Recruitment : ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ లో మేనేజ్ మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ 2023 అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.

EIL Recruitment :
EIL Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్ధ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలన్నీ మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు.
కెమికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్ , ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే కెమికల్ 5 ఖాళీలు, మెకానికల్ 16 ఖాళీలు, సివిల్ 9 ఖాళీలు, ఎలక్ట్రికల్ 7 ఖాళీలు, ఇన్ స్ట్రుమెంటేషన్ 5 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ 2023 అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా 14, మార్చి 2023ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://engineersindia.com/careers/ పరిశీలించగలరు.