Esic Jobs
JOBS : హైదరాబాద్ లోని ఈఎస్ఐసీలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి 12 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్ధుల ఎంపిక వాకిన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారు ఈఎస్ఐసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా లేదా ఫ్రొఫెసర్ గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ ఖాళీలను రిటైర్డ్ అయిన అభ్యర్థులచే భర్తీ చేయనున్నారు. రిటైర్డ్ అభ్యర్థులు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల వయోపరిమితి వయో పరిమితి18 సంవత్సరాల నుండి గరిష్టంగా 60 సంవత్సరాల వరకు ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా; ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ , సనత్ నగర్, హైదరాబాద్-500038. ఇంటర్వ్యూ తేది జూలై 18, 2022 ఉదయం 9.00 గంటల సమయం. ఒరిజినల్ డాక్యూమెంట్స్ తో హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఫలితాలు www.esic.nic.inలో అప్‌లోడ్ చేస్తారు.