హైదరాబాద్: జేఎన్‌టీయూ-హైదరాబాద్‌లో ఈనెల 23న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఇండస్ర్టీ ఇంటరాక్షన్ సెంటర్ (యూఐఐసీ) డైరెక్టర్ డా.సీహెచ్ వెంకటరమణారెడ్డి ప్రకటించారు.
25 కంపెనీల్లో 2వేల ఉద్యోగాల భర్తీ కోసం 2016, 2017, 2018లో పాస్ అయిన డిగ్రీ పట్టాలు పొందినవారు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనవచ్చు. బీకాం, బీఎస్సీ, ఏదేని బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చునని వెంకటరమణ తెలిపారు. 23వ తేదీ ఉదయం 9 గంటల నుంచిసాయంత్రం 5 గంటల వరకు జరిగే జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులు నాలుగు సెట్ల రెజ్యూమ్ కాపీలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జేఎన్‌టీయూహెచ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.