ఓయూలో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నర్ పీస్

ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు సాయంత్రం ఫెస్టివల్ ఆఫ్ ఇన్నర్ పీస్ మెడిటేషన్ త్రో మ్యూజిక్ అండ్ ఇన్నర్ డిస్కవరీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను OU స్టూడెంట్ ఎఫైర్స్ డీన్ కార్యాలయంలో శనివారం (ఫిబ్రవరి 17)న ఆవిష్కరించారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు OU ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా OU వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి హాజరవుతారన్నారు.