Iitm
IITM Pune : భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు చెందిన పూణెలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటియోరాలజీ(ఐఐటీఎమ్) లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి సైంటిస్ట్ డి 1 పోస్టు, సైంటిస్ట్ సి 2 పోస్టులు, సైంటిస్ట్ బి 17 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మాస్టర్స్ డిగ్రీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జియోఫిజిక్స్, ఒషనోగ్రఫీ, అట్మాస్ఫియరిక్, సైన్సెస్, మెటియోరాలజీ), లేదా బీఈ, బీటెక్, ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టులను అనుసరించి అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాల నుండి 50 సంవత్స రాల లోపు ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు పంపేందుకు ఆఖరు తేదిగా సెప్టెంబర్ 23, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.tropmet.res.in పరిశీలించగలరు.