BOB Recruitment 2022 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 23 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి.

Bank Of Baroda

BOB Recruitment 2022 : ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) లో ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 159 ఖాళీలకు నియామకాలు చేపట్టడతారు. అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. బ్రాంచి రీసీవబుల్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనున్న ఖాళీల జాబితాలో ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 23 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://kmcwgl.com సంప్రదించగలరు.