NRSC Recruitment 2022 : హైదరాబాద్ ఇస్రో ఎన్ఆర్ ఎస్ సీ సెంటర్లో ఖాళీల భర్తీ

అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో జేఆర్ ఎఫ్ పోస్టులకు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్,ఎమ్మెస్సీ, పీహెచ్ డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

NRSC Recruitment 2022  : భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇస్రో అధ్వర్యంలో నడపబడుతున్న హైదరబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ ఆర్ ఎస్ సీ) లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలకు నియామకాలు చేపడుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి జేఆర్ ఎఫ్ 12 ఖాళీలు, రీసెర్చ్ సైంటిస్ట్ 41 ఖాళీలు, రీసెర్చ్ అసోసియేట్ 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్ లో జేఆర్ ఎఫ్ పోస్టులకు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్,ఎమ్మెస్సీ, పీహెచ్ డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మే 8, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.nrsc.gov.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు